మహేష్ అభిమానులకు ఈ నెలంతా పండగే!

mahesh
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు ఆగష్టు నెల ఎంత ప్రత్యేకమైనదో చెప్పక్కర్లేదు. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజును ఏటా అభిమానులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా అదేవిధంగా మహేష్ పుట్టినరోజుతో పాటు మరికొన్ని ప్రత్యేక రోజులను కూడా ట్రెండ్ చేసేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. ఆగష్టు 7వ తేదీన మహేష్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘శ్రీమంతుడు’ సినిమా ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఇక ఆ రోజుతో మొదలుకొని ఆగష్టు 10న ‘అతడు’ సినిమా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఆగష్టు 11న ‘అర్జున్’ సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం.. ఇలా వీటన్నింటినీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేందుకు అభిమానులు సిద్ధమైపోయారు.

అదేవిధంగా ఆగష్టు 31న మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజును కూడా ట్రెండ్ చేసేందుకు మహేష్ అభిమానులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మహేష్ నటిస్తోన్న సినిమా విషయానికి వస్తే, మురుగదాస్‌తో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తోన్న ఆయన ఈ మధ్యే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాగా ప్రచారం పొందుతోంది. ఇక ఇదే నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఏదైనా విడుదలయ్యే అవకాశం ఉందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.