‘చిరంజీవి’ 150వ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కోసం భారీ ఏర్పాట్లు

20th, August 2016 - 03:06:54 PM

chiranjeevi-2
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న మెగాస్టార్ ‘చిరంజీవి’ 150వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని నానకరామ్ గూడలో జరుగుతోంది. దాదాపు 8 ఏళ్ల తరువాత చిరు రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. అందుకే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఆగష్టు 22న చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో టీజర్ ను విడుదల చేయనున్నారు. ‘వివి వినాయక్’ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన ‘కాజల్ అగర్వాల్’ హీరోయిన్ గా నటిస్తుండగా ‘రామ్ చరణ్’ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.