ఆ థియేటర్‌లో ‘పుష్పక విమానం’ స్పెషల్ ప్రీమియర్..!

Published on Nov 8, 2021 10:37 pm IST

దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర ఈ సినిమాని తెరకెక్కించారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను మేకర్స్ మహబూబ్‌నగర్‌లో ప్లాన్ చేశారు. కొద్ది రోజుల క్రితమే మహబూబ్‌నగర్‌లో విజయ్ దేవరకొండ “ఏవిడి” సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ థియేటర్‌లోనే నవంబర్ 11వ తేది సాయంత్రం 7 గంటలకు ‘పుష్పక విమానం’ స్పెషల్ ప్రీమియర్ షోను వేయబోతున్నారు.

సంబంధిత సమాచారం :

More