దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు నాలుగో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక సెట్ కూడా వేశారట. ఈ సెట్ లో శర్వానంద్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు.
అన్నట్టు ఈ సినిమాలో శర్వా సరసన ‘భాగ్యశ్రీ బోర్సే’ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్టపడుతున్నాడట. నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
