‘రౌడీ జనార్దన’ పై లేటెస్ట్ అప్ డేట్

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో విజయ్ దేవరకొండ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. విజయ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారట. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో విజయ్ దేవరకొండతో పాటు నలభై మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తారట. ఈ షెడ్యూల్ తర్వాత చేయనున్న షెడ్యూల్ లో ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.

అన్నట్టు ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Exit mobile version