రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అత్యంత బోల్డ్ కంటెంట్‌తో రూపొందించారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్ ఈ మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అనుమతి లభించింది.
ముఖ్యంగా ఏపీలో ఈ చిత్రానికి ఉదయం 6 గంటలకే స్పెషల్ షోలు ప్రదర్శించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక ఈ స్పెషల్ షోలకు టికెట్ రేట్లు కూడా ఏకంగా రూ.600/ గా నిర్ణయించారు. అంతేగాక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి.
దీంతో బుకింగ్స్ ఓపెన్ చేసిన టాక్సిక్ చిత్రం అప్పుడే సెన్సేషనల్ స్టార్ట్‌ను మొదలెట్టింది. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
