థమన్ మార్క్ బీట్ తో ‘గని’ నుంచి తమన్నా స్పెషల్ సాంగ్.!

Published on Jan 15, 2022 5:16 pm IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “గని”. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. అయితే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేయగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సంక్రాంతి కానుకగా ఒక స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించిన ఈ స్పెషల్ “కొడ్తే” సాంగ్ విన్నాక మాత్రం మళ్ళీ పాత థమన్ గుర్తొచ్చాడని చెప్పొచ్చు. ఐటెం సాంగ్స్ అంటేనే థమన్ కాస్త స్పెషల్ బీట్స్ ని అందిస్తాడు. అలాగే ఈ సాంగ్ కి కూడా వింటేజ్ పెప్పీ బీట్స్ తో వినసొంపైన కంపోజిషన్ చేసాడని చెప్పాలి.

అలానే ఈ సాంగ్ లో తమన్నా గ్లామర్ కూడా మంచి హైలైట్ గా కనిపిస్తుంది. ఇంకా రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం ఈ సాంగ్ లో సినిమా నేపథ్యాన్ని కూడా తెలుపుతూ మంచి మార్క్ లో ఉంది. ఓవరాల్ గా అయితే ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో మరో మంచి ట్రాక్ అని చెప్పొచ్చు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :