లేటెస్ట్ : ‘సీతారామం’ టీమ్ నుండి కృష్ణాష్టమి సర్ప్రైజ్ ….!

లేటెస్ట్ : ‘సీతారామం’ టీమ్ నుండి కృష్ణాష్టమి సర్ప్రైజ్ ….!

Published on Aug 18, 2022 11:00 PM IST

ప్రస్తుతం ఆడియన్స్ నుండి సూపర్ గా క్రేజ్ ని అలానే భారీ స్థాయిలో కలెక్షన్ ని అందుకుంటూ థియేటర్స్ లో దూసుకెళుతోంది లవ్, యాక్షన్ కం ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సీతారామం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా నటించగా రష్మిక ఒక ముఖ్య పాత్ర చేసిన విషయం తెలిసిందే.

ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సీతారామం తెలుగుతో పాటు విడుదలైన మలయాళం, తమిళ్ భాషల్లో కూడా బాగా కలెక్షన్ అందుకోవడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ మూవీలోని ఒక ప్రత్యేకమైన సాంగ్ ని రేపు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో వచ్చే తరలి తరలి అనే పల్లవితో సాగె సాంగ్ ఫుల్ వీడియో రేపు రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు