ఖైదీ నెం 150లో అదిరిపోయే ఐటమ్ సాంగ్..!

5th, September 2016 - 11:57:01 AM

chiranjeevi
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఘాటింగ్ జరుపుకుంటోంది. మెగాస్టార్ సినిమా అంటేనే సాధారంణగా అభిమానులు ఆయన నుండి మెస్మరైసింగ్ డ్యాన్సులను ఆశిస్తారు. అందుకే ఈ చిత్రంలోనూ అభిమానుల కోసం ఓ ఐటమ్ సాంగ్ ఉంది.

ఈ పాటలో చిరంజీవి తన గత సినిమాల్లో వేసినట్టే అదిరిపోయే స్టెప్పులు వేస్తాడట. ఈ సాంగ్ లో చిరంజీవి పక్కన క్యాథరిన్ థ్రెస ఆడి పాడనుంది. ఈ పాటను సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచేలా రూపొందించనున్నారు వినాయక్. ఇకపోతే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.