‘జై లవ కుశ’ లో స్పెషల్ సాంగ్ చేయడం నిజంగా ప్రత్యేకం – తమన్నా


ప్రస్తుతమున్న స్టార్ హీరోయిన్లలో నటి తమన్నాది ప్రత్యేక శైలి. సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే పలువూరు స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోందామె. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి భారీ ప్రాజెక్ట్ ‘జై లవ కుశ’ లో ఆడిపాడనుంది.

ఇప్పటికే వీరిద్దరి పై ఈ పాట చిత్రీకరణ పూర్తికాగా ఇలాంటి ప్రత్యేక గీతాల్లో నటించడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని, హీరోయిన్ అంటేనే గ్లామర్, అలాంటిది ఆమె కోసమే ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించడం అనేది నిజంగా ప్రత్యేకమే అని, ఈ పాటలు సినిమాకు ఎంతో కొంత కలిసొస్తాయని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘క్వీన్’ తెలుగు రీమేక్లో తమన్నాను తీసుకునే యోచనలో ఉన్నారు ఆ ప్రాజెక్ట్ యొక్క దర్శక నిర్మాతలు.