పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం ఈ స్టార్ హీరోయిన్

Published on Mar 24, 2022 12:35 pm IST


పుష్ప ది రైజ్ మూవీ లో సమంత ఓ ప్రత్యేక పాటలో రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసిందే, ఆమె సృష్టించిన సెన్సేషన్ మనందరికీ కనిపించింది. ఇప్పుడు, పుష్ప 2 కోసం అంతకుమించి రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సీక్వెల్‌లో ప్రత్యేక పాట ఉంటుంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్పెషల్ నెంబర్ ఎవరు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ స్పెషల్ నంబర్ చేయడానికి దిశా పటాని తప్ప మరెవరూ చర్చలు జరుపలేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

దిశా కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్. ఈ స్టార్ హీరోయిన్ చేరిక తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :