పవన్ కళ్యాణ్, సాయి తేజ్ లపై స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ ?

Published on Feb 23, 2023 10:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీతో పాటు సముద్రఖని దర్శకత్వంలో తమిళ మూవీ వినోదయ సిత్తం తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్చినట్లు తెలుస్తోంది.

నిన్న అఫీషియల్ గా లంచ్ అయిన ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూట్ నేటి నుండి ప్రారంభం అయింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం త్వరలో ఈ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల పై ఒక స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తోందట యూనిట్. నిజానికి వినోదయ సిత్తం లో సాంగ్స్ లేవు, కానీ తెలుగు స్క్రిప్ట్ లో ఈ సాంగ్ ని ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో యువ నటి కేతికా శర్మ హీరోయిన్ గా నటించనున్నారని తెలుస్తోంది. కాగా అతి త్వరలో మూవీకి సంబందించిన పూర్తి అప్ డేట్స్ తాలూకు వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :