అందరికంటే ముందుగా తమ్ముడికి స్పెషల్ థాంక్స్ – కళ్యాణ్ రామ్

Published on Aug 5, 2022 11:00 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యారు. సోషియో ఫాంటసీ మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన బింబిసార పై అందరి నుండి మంచి ప్రశంసలు కురుస్తుండడంతో యూనిట్ కొద్దిసేపటి క్రితం మూవీ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది.

తమ సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి ముందుగా కృతఙతలు చెప్పిన కళ్యాణ్ రామ్, ఈ మూవీ కోసం ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడు ఎంతో కష్టపడ్డారని, నేడు మీ ఆదరణతో మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ, ముందుగా తమ సినిమా చూసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందించడంతో పాటు మా అందరిలో మంచి భరోసా నింపిన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అని అన్నారు కళ్యాణ్ రామ్. త్వరలో బింబిసార 2 గురించి కసరత్తు మొదలెట్టి, మొదటి భాగాన్ని మించేలా దానిని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తాం అన్నారు.

సంబంధిత సమాచారం :