‘రోబో-2’ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ !


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజైన భారీ బ్లాక్ బస్టర్ చిత్రం ‘రోబో’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితమే మొదలైన ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తవగా ఇంకాస్త ప్యాచ్ వర్క్, ఒక పాట మాత్రమే మిగిలున్నాయి.

ఇవి కూడా త్వరలోనే పూర్తవనుండగా శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనుండగా ట్రైలర్ ను సెప్టెంబర్ 29న ఆయుధపూజ సందర్బంగా విడుదల చేస్తారనే టాక్ వినబడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్వ సాహా సినిమాటోగ్రఫీని, ఏఆర్ రెహ్మన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి దీపావళి రోజున సినిమాను రిలీజ్ చేయనున్నారు.