రీసెంట్ గా హాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ చిత్రం ‘ఒడిస్సీ’ తర్వాత ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తదుపరి భారీ చిత్రమే ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’. మార్వెల్ సంస్థలో వస్తున్న మరో భారీ హైప్ ఉన్న సినిమా ఇదే కాగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఊహించని ఓపెనింగ్స్ పై కన్నేసింది.
వరల్డ్ వైడ్ గా నెల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసుకున్న ఈ చిత్రం అక్కడ నుంచే మాసివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. ఇక విడుదల దగ్గరకి వస్తున్న సమయంలో ఈ సినిమా ఓపెనింగ్స్ వీకెండ్ వసూళ్లు బాక్సాఫీస్ కళ్ళు చెదిరే స్థాయిలో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రం ఏకంగా 800 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని ఈ మొదటి వారాంతంలో రాబట్టేస్తుందట.
ఇది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ రికార్డు అని తెలుస్తుంది. దీనికి ముందు అవెంజర్స్ ఎండ్ గేమ్ 1.22 బిలియన్ డాలర్స్ గ్రాస్ ని కొల్లగొట్టింది. దాని తర్వాత రికార్డు ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ దే ఉందని తెలుస్తుంది. మన దేశంలో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించే ఛాన్స్ ఉన్నట్టు స్ట్రాంగ్ టాక్ ఉంది. సో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
