ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’

ఈ ఏడాది హాలీవుడ్ సినిమా నుంచి భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా ఒకటి. టామ్ హోలాండ్ హీరోగా జెండాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా కూడా భారీ హైప్ లో వచ్చింది.

అయితే ఈ సినిమా మన దగ్గర భారీ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకున్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు ఇండియా వైడ్ గా సినిమా సుమారు 70 కోట్లకి పైగానే గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇది ఓ హాలీవుడ్ సినిమాకి ఇండియన్ మార్కెట్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ అన్నట్టు తెలుస్తోంది. గత సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ 60 కోట్ల మేర రాబట్టినట్టు తెలుస్తోంది.

సో స్పైడర్ మ్యాన్ దాన్ని బ్రేక్ చేసి దుమ్ము లేపినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టాక్ కొంచెం మిక్స్డ్ గానే వచ్చింది కానీ ఆల్రెడీ ప్రీ సేల్స్ గట్టిగా జరిగాయి. ఇలా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఇక ఫుల్ రన్ లో సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

Exit mobile version