ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌’..!

Published on Mar 11, 2022 11:20 pm IST


టామ్ హాలండ్ హీరోగా న‌టించిన ‘స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌’ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. గ‌తేడాది డిసెంబ‌ర్ 16న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. అయితే స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్‌లో వ‌చ్చిన క‌థ‌ల‌ను, క్యారెక్ట‌ర్ల‌ను క‌నెక్ట్ చేసుకుంటూ ఒక సినిమాగా తీయ‌డంలో దర్శకుడు జాన్ వాట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైపోయింది. మార్చి 23వ తేది నుంచి బుక్ మై షో ప్లాట్ ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కానుంది. టామ్ హాలండ్ స్పైడ‌ర్‌మ్యాన్‌ సిరీస్‌ల‌లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం అని చెప్పొచ్చు. అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌ర్వాత ఆ స్థాయిలో ఆక‌ట్టుకున్న సినిమా కూడా ఇదే. ఇక స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌’ ఇండియాలో 200 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :