“పుష్ప”రాజ్‌కి ఆ సినిమా దెబ్బేసే ఛాన్స్ ఉందా?

Published on Nov 19, 2021 3:01 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే పుష్ప రాజ్‌తో ఓ సినిమా క్లాష్‌కి సిద్దమయ్యింది.

అయితే “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” కొత్త ట్రైలర్ నిన్న విడుదల కాగా ఈ ట్రైలర్‌లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. అదే రోజున ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా మూవీగా పలు ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్’కు అభిమానులు ఉండడంతో ఈ సినిమా పుష్ప రాజ్‌కి ఏమైనా దెబ్బేసే ఛాన్స్ ఉంటుందేమోనని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More