‘స్పిరిట్’.. నెగిటివిటీలోనూ పాజిటివ్ యాంగిల్ ?

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. తాజాగా ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ప్రభాస్ పాత్రలో గ్రే షేడ్స్ కూడా ఉంటాయని.. నెగిటివిటీలోనూ పాజిటివ్ యాంగిల్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ.. ప్రభాస్ పాత్ర సాగుతుందని.. పైగా ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ పాత్ర లుక్ కి, సెకండ్ హాఫ్ లో ప్రభాస్ పాత్ర లుక్ కి చాలా వెరీయేషన్ ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ అత్యుత్తమంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ పోలీస్ యాక్షన్ డ్రామాలా కాకుండా, వైల్డ్ నేచర్ ఉన్న ఓ మాజీ పోలీస్ పతనం – పోరాటం చుట్టూ నడిచే డార్క్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. ముఖ్యంగా ‘పోలీస్ వర్సెస్ క్రిమినల్స్’ కంటే, ఒక వ్యక్తి తనను తాను ఎలా తిరిగి నిలబెట్టుకున్నాడనే క్యారెక్టర్ డ్రామా కొత్త కోణంలో సాగుతుందట. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. మొత్తానికి ‘స్పిరిట్‌’ పై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.

Exit mobile version