‘పెద్ది’లో మెయిన్ థీమ్ స్పోర్ట్స్ కాదు..మరేంటి? మొదటి నుంచీ హింట్ ఇచ్చిన బుచ్చిబాబు

Peddi-Movie

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ రూరల్ డ్రామానే ‘పెద్ది’. దర్శకుడు సుకుమార్ తో చేసిన రంగస్థలం తర్వాత మళ్ళీ అదే ఫార్మాట్ లో భారీ స్థాయిలో నిర్మాణం వహించబడి వస్తున్న ఈ సినిమా పట్ల అనేక వెర్షన్ లు వినిపిస్తూ వచ్చాయి. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామా గానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు.

మరో ప్లాన్ తో బుచ్చిబాబు

అంతే కాకుండా మొన్న వచ్చిన ట్రైలర్ లో కూడా మేకర్స్, సినిమాలో సోల్ కాన్సెప్ట్ ని దాచి ఉంచి రామ్ చరణ్ ని ఒక స్పోర్ట్స్ మ్యాన్ గానే చూపిస్తూ వచ్చారు. దీనితో ఈ సినిమా అంతా కేవలం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే కొనసాగుతుంది అని అందరిలో బలంగా నాటుకుపోయింది. కానీ బుచ్చిబాబుకి సినిమాలో వేరే ప్లాన్ లు ఉన్నాయి.

‘రైల్వే ట్రాక్’ సినిమాకి సోల్?

ఈ సినిమాలో స్పోర్ట్స్ అనేది కేవలం ఒక వంతు మాత్రమే కానీ ఈ చిత్రం నడిచేది ఓ ‘రైల్వే ట్రాక్’ అంశం మీద అని చెప్పొచ్చు. తాజాగా వదిలిన కొత్త పోస్టర్ లో ఒక రైల్వే ట్రాక్ ని అంతర్లీనంగా చూపించడం జరిగింది. సో పెద్ది అనే సినిమాలో పలు రకాల క్రీడలు ఉండొచ్చు కానీ పెద్ది గాడి పోరాటం మాత్రం తన ఊరి ఉనికి కోసం, వారికి రైల్వే ట్రాక్ కోసమో అయ్యి ఉండొచ్చు. ఈ క్రమంలోనే పెద్ది పాత్ర ఢిల్లీ వెళ్లడం అక్కడ అర్జీ చేయడం లాంటివి జరిగి ఉండాలి.

బుచ్చిబాబు ఎప్పటి నుంచో హింట్స్

అసలు సినిమా మొదలు పెట్టినపుడు వదిలిన అనౌన్సమెంట్ గ్లింప్స్ ఇంకా పోస్టర్స్ లో కూడా ట్రైన్ కి సంబంధించిన విజువల్స్ నే కనిపిస్తాయి. అక్కడ నుంచి రామ్ చరణ్ పై ఓ పోస్టర్ కూడా రైల్వే ట్రాక్ పైనే కనిపిస్తుంది. ట్రైలర్ లో మొదటి షాట్ కూడా రైల్వే ట్రాక్ మీదనే.. ఆ తర్వాత కూడా కొన్ని ఉన్నాయి. ఇలా వీటిని హింట్స్ గా మాత్రమే బుచ్చిబాబు ఇచ్చి వదిలేసాడు. డెఫినెట్ గా ఇవి థియేటర్స్ లో వర్క్ అయితే మాత్రం రామ్ చరణ్ నుంచి మరో ఇంటెన్స్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని మనం చూడొచ్చు. సో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేసాడో తెలియాలి అంటే ఈ జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Exit mobile version