‘స్పైడర్’ సెన్సార్ టాక్లో ఎక్కువగా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట !


మహేష్ – మురుగదాస్ ల ‘స్పైడర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని కొద్దిసేపటి క్రితమే పూర్తిచేసుకుని బోర్డు నుండి U /A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సెన్సార్ కార్యక్రమం ద్వారా వినిపిస్తున్న టాక్లో ఒక అంశం మాత్రం బాగా హైలెట్ అవుతోంది. అదేమిటంటే చిత్రంలోని యాక్షన్ కంటెంట్ అదిరిపోయేలా ఉందట. తెలుగు ప్రేక్షకులు ఇది వరకెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలని ఇందులో చూడొచ్చట. ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ ఎపిసోడ్లు ఆడియన్సును ఆశ్చర్యానికి గురిచేస్తాయని అంటున్నారు.

ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా మహేష్ ఇదే మాట చెప్పారు. పీటర్ హెయిన్స్ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలని చాలా బాగా రూపొందించారని, సినిమా అనుకున్నప్పుడే మురుగదాస్ అదిరిపోయే యాక్షన్ ఉంటుందని చెప్పారని, చిత్రీకరణలో కూడా పోరాట సన్నివేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. మరి మహేష్ చెప్పిన ప్రకారం, సెన్సార్ టాక్ దృష్ట్యా యాక్షన్ కంటెంట్ ఎంతలా అలరించిందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.