మే నుండి మొదలుకానున్న ‘స్పైడర్’ క్లైమాక్స్ !


తెలుగు పరిశ్రమ ఈ ఏడాది ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు ‘స్పైడర్’ కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు టైటిల్, ఫస్ట్ లుక్ లేట్ చేసి అభిమానుల్ని కాస్త అసహనానికి గురిచేసిన టీమ్ ప్రస్తుతం రిలీజ్ డేట్ ను వాయిదా వేసి నిరుత్సాహపరిచింది. అయినా ఆ వెంటనే ఆగష్టు 9ని కొత్త తేదీగా ప్రకటించి కాస్త ఊరటనిచ్చింది. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్న క్లైమాక్స్ ను కొన్ని కారణాల వలన మార్చినట్టు తెలుస్తోంది.

ఆ మార్చిన స్క్రిప్ట్ నే వచ్చే మే నెల మొదటి వారం నుండి షూట్ చేస్తారట. అది పూర్తైతే సినిమా మొత్తం దాదాపుగా అయిపోయినట్టేనట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ చిత్రంతో మహేష్ తన మార్కెట్ పరిధిని ఇంకాస్త పెంచుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇకపోతే మహేష్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా, ఎస్.జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండగా హరీశ్ జైరాజ్ సంగీతం, సంతోష శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.