సెన్సార్ పూర్తిచేసుకున్న ‘స్పైడర్’!


అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమైన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘స్పైడర్’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఇక చిత్ర రన్ టైమ్ చూస్తే రెండు గంటల 25 నిముషాలుగా ఉంది. స్పై థ్రిల్లర్ గా రూపోందిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైనదిగా చెప్పబడుతోంది.

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా తమిళ నటులు ఎస్.జె సూర్య, భరత్ లు ప్రతినాయకులుగా నటించారు. ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం సమకూర్చగా పీటర్ హెయిన్స్ స్టంట్స్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేశారు. తెలుగు, తమిళ భాషలతో పాటు అరబిక్ లో సైతం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.