‘స్పైడర్’ మొదటిరోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్ల వివరాలు !

28th, September 2017 - 06:37:30 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కలయికలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌ లు సంయుక్తంగా నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పైడర్‌’ నిన్న సెప్టెంబర్ 27 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెల్సిందే. భారీ అంచనాలతో దిగిన ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడలాని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర టీమ్ వసూళ్లను ప్రకటించింది.

నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ‘స్పైడర్‌’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని, ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లో 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించిందని అన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొదటిరోజు రూ. 51 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని, ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు.