‘స్పైడర్’ ఒక స్టైలిష్ ఫిల్మ్ – మహేష్


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారీ బడ్జెట్ చిత్ర్రం ‘స్పైడర్’ ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఎన్నాళ్ళ నుండో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మహేష్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నిటికన్నా మొట్ట మొదటిసారి ప్రిన్స్ స్పై ఏజెంట్ గా నటించిన ఈ చిత్రం ఏ తరహాలో ఉంటుందో చూడాలని అందరూ కుతూహలంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ సినిమా ఏ రకంగా ఉండబోతోందో తెలిపారు.

‘మురుగదాస్ సినిమాలు రెండు రకాలు. ఎమోషనల్ గా ఉండే ‘రమణ, కత్తి’ ఒక టైప్ సినిమాలైతే స్టైలిష్ గా ఉండే ‘గజినీ, తుపాకి’ రెండో తరహా సినిమాలు. ‘స్పైడర్’ రెండో తరహాకు చెందిన స్టైలిష్ సినిమా. ప్రతి షాట్ స్టైలిష్ గా ఉంటుంది. మురుగదాస్ ఎమోషన్స్ ని ఎప్పుడూ వదిలిపెట్టరు కాబట్టి ఇందులో అవి కూడా ఉంటాయి’ అన్నారు. మహేష్ చేసిన ఈ తొలి ద్విభాషా చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ నటించింది.