ప్రపంచవ్యాప్తంగా ‘జై లవ కుశ, స్పైడర్, మహానుభావుడు’ వసూళ్లు !


ఈ దసరాకి తెలుగులో మూడు సినిమాలు రిలీజవ్వగా అందులో రెండు ‘జై లవ కుశ, స్పైడర్’ లు భారీ చిత్రాలు కాగా ‘మహానుభావుడు’ మీడియం స్థాయి సినిమాగా విడుదలైంది. వీటిలో మీదుగా రిలీజైన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ భారీ ఓపెనింగ్స్ సాధించి 11 రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల షేర్ ను రాబట్టి తారక్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రంగా నిలుస్తోంది.

అలాగే మహేష్ ‘స్పైడర్’ గత బుధవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుని 5 రోజులకుగాను రూ.43.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక శర్వానంద్ ‘మహానుభావుడు’ మొదటిరోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుని నిన్నటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూడింటిలో ‘మహానుభావుడు’ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లగా ‘స్పైడర్, జై లవ కుశ’ కొనుగోలుదారులకు ఇంకా రికవర్ అవ్వాల్సిన మొత్తం చాలానే ఉంది.