‘స్పైడర్’ చివరి పాట షూట్ ఎక్కడో తెలుసా !


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’ చివరి దశకు చేరుకుంది. ఇక ఒకే ఒక్క మాట మినహా అన్ని పనులు పూర్తైపోయాయి. ఈ పాటను 33 నెల 23న చిత్రీకరించడం మొదలుపెట్టనున్నారు. అది కూడా ఫారిన్ లొకేషన్ అయిన రొమానియాలో చిత్రీకరించనున్నారు. యూరప్ దేశమైన రోమానియా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.

ఇలాంటి లొకేషన్లో రూపుదిద్దుకోనుందంటే పాట ఖచ్చితంగా విజువల్ ట్రీట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇదివరకే విడుదలైన ట్రైలర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో సినిమాపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లను సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలకానున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నారు.