సాయంత్రం సందడి చేయనున్న మహేష్ ‘స్పైడర్’!


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సెప్టెంబర్ 27 విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర నిర్మాతలు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమా అనుకున్న సమయానికి రిలీజయ్యేలా అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ముందుగా తెలుగు, తమిళ టీజర్లకు వదిలిన టీమ్ ఈరోజు సాయంత్రం మలయాళ వెర్షన్ టీజర్ ను ప్రేక్షకులకు అందించనున్నారు.

ఈ చిత్రంతో తమిళ పరిశ్రమలో అధికారికంగా అడుగుపెడుతున్న మహేష్ బాబు తన మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించాలని బలంగా ప్లాన్ చేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీ, అరబిక్ భాషల్లో కూడా చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, ఓవర్సీస్ లలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా పట్ల అభిమానులు, ప్రేక్షకుల్లో తారస్థాయి అంచనాలున్నాయి. ఇకపోతే చిత్ర టీజర్ ను ఈ నెల 9న చెన్నైలో జరగనున్న ఈవెంట్లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.