స్పీడ్ పెంచిన ‘స్పైడర్’ టీమ్ !


స్టార్ డైరెక్టర్ మురుగదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘స్పైడర్’. ఇప్పటికే ఒకసారి విడుదల వాయిదాపడిన ఈ చిత్రాన్ని ఈసారైనా చెప్పిన తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఒక్క డ్యూయెట్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తిచేసిన మురుగదాస్ త్వరలోనే ఆ పాటను కూడా కంప్లీట్ చేయనున్నారు.

మరోవైపు డబ్బింగ్ తో పాటు పోస్ట్ ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు డబ్ ముగించేసిన మహేష్ తమిళ డబ్బింగ్ ను కూడా దాదాపు చెప్పేశారట. ఇక ఆడియోలో రెండవ పాట ‘పుచ్చకాయ పుచ్చకాయ’ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ సింగర్ బ్రిజేష్ శాండిల్య పాడిన ఈ పాట అరబిక్ స్టైల్ తో తెరకెక్కినట్టు సమాచారం. ఎస్.జె సూర్య, భరత్ లు ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 9న చెన్నైలో జరగనున్న మహేష్ కోలీవుడ్ లాంచింగ్ ఈవెంట్ సందర్బంగా రిలీజ్ చేయనున్నారు.