మహేష్ డెడికేషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాత !
Published on Aug 16, 2017 12:37 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’ దాదాపుగా అన్ని పనుల్ని పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలవుతుండటం వలన విడుదల వాయిదాపడిన ఈ చిత్రం ప్రస్తుతం ఎలాంటి అడ్డంకి లేకుండా సెప్టెంబర్ 27 రిలీజ్ కు సిద్ధమైపోతోంది. నిన్న మొన్నటి వరకు తమిళ వెర్షన్ డబ్బింగ్ పనులు కొనసాగగా తాజాగా అవి కూడా పూర్తైపోయాయట. మహేష్ కూడా తన పాత్ర తాలూకు డబ్బింగ్ ను పూర్తిచేసేశారట. మహేష్ తమిళంలో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి.

అయినా కూడా చాలా బాగా చెప్పారని, ఆయన తమిళం మాట్లాడిన తీరు, యాస అన్నీ చాలా పక్కాగా కుదిరాయని, ఆ పర్ఫెక్షనే ఆయన్ను ఇతరుల నుండి ప్రత్యేకంగా చూపిస్తుందని నిర్మాత ఠాగూర్ మధు సంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ చిన్నప్పటి రోజుల్లో చెన్నైలో పెరగడం ఈ డబ్బింగ్ కు చాలా సహకరించిందని కూడా అన్నారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook