‘స్పైడర్’ ఫస్టాఫ్, సెకండాఫ్ ఇలానే ఉండబోతున్నాయి !


సూపర్ స్టార్ మహేష్ తొలిసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. ఎన్నాళ్లగానో ఊరిస్తూ, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంటుందో, మహేష్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ప్రమోషన్లలోమహేష్ తో పాటు ప్రతినాయకుడిగా నటించిన ఎస్ జె సూర్య కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతో సినిమా ఎలా ఉండబోతోందో రెండు వాఖ్యాల్లో వివరించారు.

ఆయనమాట్లాడుతూ ‘ఈ సినిమా ఫస్టాఫ్ చాలా నవలాత్మకంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల కోసమే అన్నట్టు ఉంటాయి. మొత్తం మీద థ్రిల్లింగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు. ఎస్.జె సూర్య మాటల్ని బట్టి చూస్తుంటే మురుగదాస్ కమర్షియల్ అంశాలతో పాటు తానెప్పుడూ మిస్ కాకుండా చూసుకునే ఎమోషన్ ను కూడా ఇందులో బాగానే ఎలివేట్ చేశారని అనిపిస్తోంది.

ఈ నెల 27న విడుదలకానున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా మరొక తమిళ నటుడు భరత్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు.