భారీ ధరకు అమ్ముడైన ‘స్పైడర్’ తమిళ హక్కులు !

25th, July 2017 - 08:32:56 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ ల కలయికలో రూపొందుతున్న ‘స్పైడర్’ సినిమా ఈ ఏడాది టాలీవుడ్ ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. అందుకే ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ నెలకొని ఉంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధర పలికి బ్రహ్మాండమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్న ఈ చిత్రం యొక్క తమిళ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ, రోబో – 2 వంటి చిత్రాల్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ కంపెనీ ఈ హక్కుల్ని సుమారు రూ.23 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందట. ఈ సంస్థ చేతిలోకి సినిమా వెళ్లడం ద్వారా భారీ స్థాయి రిలీజ్, ప్రమోషన్లు దొరికి మంచి ఓపెనింగ్స్ దక్కనున్నాయి. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సెప్టెంబర్ 27న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.