ప్రముఖ టీవీ ఛానెల్ చేతికి ‘స్పైడర్’ తమిళ హక్కులు !
Published on Sep 12, 2017 2:16 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ చిత్రం పట్ల తెలుగునాట ఎంతటి క్రేజ్ ఉందో తమిళనాట కూడా అదే స్థాయి క్రేజ్ నెలకొంది. మహేష్ తమిళంలోకి అధికారికంగా లాంచ్ అవుతున్న చిత్రం కావడం, మురుగదాస్ డైరెక్ట్ చేయడం, తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా రూపొందటంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ క్రేజ్ వలన తమిళ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.

తాజాగా తమిళ వెర్షన్ టెలివిజన్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ సన్ టీవీ దక్కించుకుంది. ఈ డీల్ విలువెంతో బయటకురాలేదు కానీ ఎక్కువ మొత్తంలోనే ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబందించి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వేడుకా జరగని నైపథ్యంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని 15వ తేదీన సాయంత్రం శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు.

 
Like us on Facebook