‘స్పైడర్’ ఫుటేజ్ లీకవలేదంటున్న టీమ్ !


సూపర్ స్టార్ మహేష్ నన్ను నటించిన ‘స్పైడర్’ చిత్రం యొక్క ఫుటేజ్ లీకైందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి జరుగుతోంది. ఈ లీకేజ్ కు సంబందించిన కొన్ని వీడియోలు కూడా మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో అభిమానుల్లో కొంత అలజడి నెలకొన్న పరిస్థితి ఏర్పడింది. దీన్నీ గమనించిన చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

సినిమాకు సంబంధించి ఎలాంటి ఫుటేక్ లీక్ కాలేదని చెప్పిన టీమ్ కొందరు కావాలనే పుకార్లను పుట్టిస్తూ, ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ కొంత కుదుటపడ్డారు. ఇకపోతే ఈ ద్విభాషా చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. అంతేగాక ఈ నెల 9న చెన్నైలో మహేష్ తమిళ లాంచింగ్ ఈవెంట్ భారీ ఎత్తున చేపట్టనున్నారు.