‘స్పైడర్’ ట్రైలర్ ను సిద్ధం చేస్తున్న మురుగదాస్ !


సూపర్ స్టార్ మహేష్ ‘స్పైడర్’ చిత్రీకరణ ఆఖరి దశలో ఉంది. మిగిలి ఉన్న ఒక్క డ్యూయెట్ ను ఈ నెలాఖరుకు పూర్తిచేయనున్నారు టీమ్. ఇక రిలీజ్ తేదీ సెప్టెంబర్ 27 దగ్గరపడుతుండటంతో భారీ స్థాయి ప్రమోషన్లకు ప్లాన్ చేశారు యూనిట్. అందులో భాగంగానే మహేష్ ను తమిళంలోకి లాంచ్ చేస్తూ సెప్టెంబర్ 9న చెన్నైలో పెద్ద ఈవెంట్ ను జరపనున్నారు.

ఈ ఈవెంట్లోనే థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారట. ఇప్పటికే మురుగదాస్ ట్రైలర్ కట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. మరి టీజర్ తో మంచి హైప్ ను క్రియేట్ చేసిన స్పైడర్ ట్రైలర్ తో ఎంత హంగామా చేస్తుందో చూడాలి. సుమారు రూ.100 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి హారీశ్ జైయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.