భారీ పోరాటాలతో ‘స్పైడర్’ క్లైమాక్స్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు ‘స్పైడర్’ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారు. ఇటీవలే చెన్నైలో జరిగిన చివరి షెడ్యూల్లో సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ను షూట్ చేశారట. ముందు నుండి చెబుతున్నట్టు హెవీ యాక్షన్ సబ్జెక్ట్ కలిగిన ఈ చిత్రంలో భారీ తరహా పోరాట సన్నివేశాలు ఉన్నాయట. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే ఫైట్ ను భారీ స్థాయిలో, తీవ్రమైన రీతిలో రూపొందించారట.

ప్రముఖ ఫైటింగ్ కొరియోగ్రఫర్, బాహుబలి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పనిచేసిన పీటర్ హెయిన్స్ ఈ పోరాటాల్ని కంపోజ్ చేశారని, మహేష్, ఎస్.జె సూర్యలకు మధ్య నడిచే ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్, ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందని టాక్. మరి ఈ కిక్ ఏ స్థాయిలో ఉంటుందో చిత్రం విడుదలయ్యాక చూడాలి. ఇక కేవలం రెండు పాటలు చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతలు ఆలోచన.