కర్ణాటకలో భారీ ఎత్తున విడుదలకానున్న ‘స్పైడర్’ !
Published on Sep 22, 2017 4:04 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ ఈ నెల 27న పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎంత గ్రాండ్ గా విడుదలవుతుందో కర్ణాటకలో కూడా అంతే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటకలో సుమారు 250 స్క్రీన్లలో చిత్రం విడుదలకానుంది. తెలుగు, తమిళం రెండు వెర్షన్లకు కలిపి ఈ 250 స్క్రీన్లు.

అలాగే తమిళనాడులో కూడా చిత్రం భారీ ఎత్తున విడుదలవుతోంది. మహేష్ అధికారికంగా ఏ చిత్రంతో కోలీవుడ్లో అడుగుపెడుతున్న సందర్బంగా ఈ గ్రాండ్ రిలీజ్ ను ప్లాన్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేయడం, తెలుగుతో పాటు తమిళంలో కూడా సపరేట్ గా సినిమా రూఒపొందటంతో తమిళుల్లో కూడా మంచి క్రేజ్ నెలకొంది. ఈ వైడ్ రిలీజ్ తో మహేష్ కళ్ళు చెదిరే ఓపెనింగ్సును కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 
Like us on Facebook