చెప్పిన సమయానికే వస్తానంటున్న మహేష్ !

29th, June 2017 - 08:52:32 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్లో ‘భరత్ అనే నేను’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మురుగదాస్ తో మహేష్ చేస్తున్న ‘స్పైడర్’ సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలొచ్చాయి. కానీ స్పైడర్ టీమ్ మాత్రం అలాంటిదేమీ లేదని పుకార్లను కొట్టిపారేస్తోంది. కేవలం రెండు పాటలు మినహా మిగతా షూట్ మొత్తం పూర్తయిందని చెబుతోంది.

అంతేగాక పాటల్లో ఒకదాన్ని ముందుగా జూలై 5వ తేదీ నుండి షూట్ చేస్తామని, ఇంకో పాటను ఆగష్టు నెల మొదట్లో స్టార్ట్ చేస్తామని అన్నారు. అలాగే గ్రాఫికల్ వర్క్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నామని, అయినా ముందుగా చూపిన ప్రకారం సెప్టెంబర్ 29న సినిమా విడుదలవుతుందని అన్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.