‘స్పైడర్’ టీమ్ నుండి సడన్ సప్రైజ్ !
Published on Jul 30, 2017 4:35 pm IST


మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రం కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా నుండి ఎప్పుడెప్పుడు కొత్త విషయం బయటికొస్తుందా అని అందరూ ఎంతాగానో వేచి చూస్తున్నారు. అందుకే కేవలం గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో కొన్ని సెకన్ల నిడివి మాత్రమే ఉన్న చిన్న వీడియోను మాత్రమే రిలీజ్ చేసి సరిపెట్టుకున్న టీమ్ ఈరోజు ఒక సడన్ సప్రైజ్ ప్లాన్ చేసింది.

సాయంత్రం 6 గంటలకు ఈ సప్రైజ్ ఉండనుంది. అయితే ఈ సప్రైజ్ లో పాటల టీజర్ ఉంటుందా, మేకింగ్ వీడియో ఉంటుందా, పాత్రల పరిచయం ఉంటుందా, సినిమా టీజర్ ఉంటుందా, సినిమాలోని భారీతనాన్ని చూపే శాంపిల్ వీడియో ఉంటుందా లేకపోతే ఆడియో విడుదల తేదీ ఉంటుందా అనేది స్పష్టంగా తెలీడం లేదు. కాబట్టి ట్రీట్ ఏంటో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సెప్టెంబర్ 27న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook