స్పైడర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై కాటికాపర్ల రచ్చ!


సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి సినిమా అనే చూసే ప్రేక్షకుల ముంచి అభినందనలు అందుతున్న. సినిమా మీద వచ్చిన నెగిటివ్ పబ్లిసిటీతో తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో స్పైడర్ సినిమా మహేశ్ కెరియర్ లో మరోసారి డిస్టిబ్యూటర్స్ కి భారీ నష్టాలు మిగిల్చేలా ఉంది.

ఇది ఇలా ఉంటె ఇప్పుడు సినిమాలో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాటి కాపర్లని కించపరిచే విధంగా చూపించారని ఆ సంఘం ప్రతినిధులు ఆందోళనకి రెడీ అయ్యారు. స్పైడర్ సినిమాలో కాటికాపర్లని కించ పరిచే విధంగా ఉన్న సన్నివేశాలని తక్షణం తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్ చేసారు. హైదరాబాద్ లో రామంతపూర్ లో హిందూ స్మశాన వాటికలో కాపర్లు సంఘంలో అందరు సమావేశం అయ్యారు.

శ్మశానంలో కాటికాపర్లు చాలా కష్టపడి చనిపోయిన శవాలని దహన సంస్కారాలు, పూడ్చి పెట్టడం వంటి పనులని సంప్రదాయ పద్ధతిలో చేస్తూ ఉంటారని, అలాంటి వారిని కించపరుస్తూ చూపించడం కరెక్ట్ కాదని ఆ సంఘం ప్రతినిధులు అన్నారు. అందులో ఉన్న సన్నివేశాలని తక్షణం తొలగించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మరి ఈ కాటి కాపర్ల సెగ స్పైడర్ టీంకి తగులుతుందో, లేదో చూడాలి.