‘స్పైడర్’ షూట్ కు హైదరాబాద్లో ఆటంకం !

15th, May 2017 - 08:43:34 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కలయికలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’ ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర క్లైమాక్స్ ను ముందుగా హైదరాబాద్లో ప్లాన్ చేశారు. ఇది వరకే మొదలుకావాల్సిన ఈ షూట్ భాగ్యనగరంలో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ కారణాల వలన ఆగింది.

దీంతో చిత్ర నిర్మాతలు పూర్తిగా షూటింగ్ స్పాట్ నే చెన్నైకు తరలించారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నందున షూట్ రేపటి నుండి మొదలవుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో మొత్తం టాకీ పూర్తికానుండగా మిగిలిన పాటలను విదేశాల్లో షూట్ చేయనున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ మే 31న కృష్ణగారి పుట్టినరోజు సందర్బంగా విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.