లక్ష 82వేల సంవత్సరాలతో రికార్డ్ సెట్ చేసిన “స్క్విడ్ గేమ్”.!

Published on Nov 17, 2021 6:04 pm IST

లేటెస్ట్ ఓటిటి వరల్డ్ సెన్సేషన్ “స్క్విడ్ గేమ్”. కొరియా కి చెందిన హిట్ కంటెంట్ లో ఇది కూడా ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రిలీజ్ అవ్వడంతో గ్లోబల్ హిట్ గా హిస్టారికల్ రికార్డ్స్ సెట్ చేసింది. జస్ట్ రెండు మూడు భాషల్లోనే అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లోనే కాకుండా టోటల్ ఓటిటి హిస్టరీ లోనే హైయెస్ట్ వ్యూస్ తో ముందు సిరీస్ లు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓటిటి వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ స్క్విడ్ గేమ్ ని నెట్ ఫ్లిక్స్ యూజర్స్ వీక్షించిన గంటల లెక్క బయటకి వచ్చింది. అది 1.65 బిలియన్ గంటలు అట. అంటే ఏకంగా ఇది ఒక లక్షా 82 వేలు సంవత్సరాలతో సమానం అంట. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ లో చూసారో.. దీని తర్వాత ఇదే నెట్ ఫ్లిక్స్ నుంచి మరో కొరియన్ సిరీస్ కూడా రాబోతుంది మరి దానికి ఎంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :