వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “SR కళ్యాణ మండపం”

Published on Jan 2, 2022 10:29 pm IST


కిరణ్ అబ్బవరం హీరోగా, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా శ్రీధర్ గాదె దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం SR కళ్యాణ మండపం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. అంతేకాక ఆహా వీడియో ద్వారా డిజిటల్ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అక్కడ సైతం విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం జనవరి 9 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈటీవీ లో ప్రసారం కానుంది. ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ మరియు రాజు లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో సాయి కుమార్ కీలక పాత్ర లో నటించారు. బుల్లితెర పై ఎలాంటి విజయం సాధిస్తుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :