ఆహా లో విడుదల కానున్న “SR కళ్యాణ మండపం”

Published on Aug 17, 2021 3:47 pm IST


కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం SR కళ్యాణ మండపం. ఈ చిత్రం ఇటీవల థియేటర్ల లో విడుదల అయి ఘన విజయం సాధించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ఆహా వీడియో లోకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. అతి త్వరలో ఆహా వీడియో లోకి SR కళ్యాణ మండపం రానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన తో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని పాటలు యువతను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లో కిరణ్ నటన కి, ప్రియాంక అందానికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు.

సంబంధిత సమాచారం :