వరుస చిత్రాలతో దూసుకు పోతున్న శ్రీలీల

Published on May 4, 2023 1:54 am IST


పెళ్లి సందడి చిత్రంతో రోషన్ సరసన అమ్మాయి శ్రీలీల టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బ్లాక్ బస్టర్ అయిన రవితేజ ధమాకాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. శ్రీలీల డ్యాన్స్ మూవ్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఆ తర్వాత ఆ యువ నటి వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే చిత్రం మరియు నందమూరి బాలకృష్ణ 108వ చిత్రాల్లో నటిస్తోంది.

బోయపాటి – రామ్ పోతినేని రాబోయే చిత్రం, పంజా వైష్ణవ్ తేజ్ యొక్క నాల్గవ చిత్రం మరియు నితిన్ యొక్క రాబోయే చిత్రంలోనూ శ్రీలీల లీడ్ రోల్ లో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో ఆమె కొత్త ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది. మెజారిటీ చిత్రనిర్మాతలు తమ చిత్రాల కోసం ఈ యంగ్ బ్యూటీని కలిగి ఉండాలని తహతహ లాడుతున్నారు. టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టుల్లో కూడా భాగమైన ఈ భామ, ఇంకెన్ని ఆఫర్స్ దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :