సంక్రాంతి సినిమాలో శ్రీవిష్ణు ఎంట్రీ.. షూటింగ్ ముగించుకున్న యూనిట్..!

Nari-Nari-Naduma-Murari

సంక్రాంతి పండుగ సీజన్‌లో ఈసారి పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇందులో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుతో ఈ మూవీ రానుంది. ఈ సినిమాతో శర్వానంద్ పండుగ బరిలో మంచి విజయాన్ని అందుకునేందుకు సిద్ధవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో మరో హీరో క్యామియో ఉండబోతుందని తెలుస్తోంది. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఈ సినిమాలో ఓ క్యామియో ఎంట్రీతో కనిపిస్తాడని.. ఆయన క్యామియో చిత్రానికి కీలక పాయింట్‌లో రాబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు ఈ సినిమాలో శ్రీవిష్ణు ఎంట్రీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక శర్వానంద్-శ్రీవిష్ణు కలిసి ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా ఈ చిత్ర యూనిట్ షూటింగ్ ముగించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

Exit mobile version