మరో ఇంట్రెస్టింగ్ సినిమా కంప్లీట్ చేసేసిన శ్రీవిష్ణు!

Published on Oct 5, 2021 12:30 pm IST

మన టాలీవుడ్ లో ఈ లాక్ డౌన్ 2.0 తర్వాత భారీ హిట్ అందుకున్న సినిమాల్లో “రాజ రాజ చోర” కూడా ఒకటి. శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి బజ్ తో వచ్చి భారీ హిట్ గా నిలిచింది. తన కెరీర్ లోనే పెద్ద హిట్ ఇది. తన సినిమాల ఎంపిక పరంగా మినిమమ్ ప్రామిసింగ్ ఇచ్చే శ్రీవిష్ణు నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నే “అర్జున ఫల్గుణ”.

పలు భారీ చిత్రాల బ్యానర్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లో తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా షూట్ అంతటిని కంప్లీట్ చేసుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అప్డేట్ ని ఇచ్చారు. ఇక ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటడ్ బ్యూటీ అమృత అయ్యర్ శ్రీవిష్ణు సరసన నటించగా త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ కానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :