ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ తో శ్రీ విష్ణు నెక్స్ట్.!

Published on Feb 14, 2023 11:08 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో శ్రీవిష్ణు కూడా ఒకడు. మరి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలతో పలకరించే తాను ఇప్పుడు మరో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తో అయితే రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని అయితే రిలీజ్ చేసారు.

మరి ఈ చిత్రానికి “సామజవరగమన” అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా దీనిపై డిజైన్ చేసిన లుక్ కూడా బాగుంది. వీణ తో మధ్యలో శ్రీ విష్ణు ఉంటే తనని కట్టేసినట్టుగా ఇతర నటులు నరేష్, వెన్నెల కిషోర్ అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ మరియు హీరోయిన్ రెబ మోనికా కనిపిస్తున్నారు. దీనితో అయితే ఓ మంచి ప్రామిసింగ్ ఎంటర్టైనర్ వీరి నుంచి వస్తుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి అయితే గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు హాస్య ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :