ప్రముఖ బ్యానర్ సమర్పణలో శ్రీవిష్ణు లేటెస్ట్ సినిమా ఆరంభం..!

Published on Sep 25, 2022 11:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ హీరోస్ లో అతి తక్కువమంది ఫైనెస్ట్ యాక్టర్స్ ఉంటే వారిలో హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. తాను లేటెస్ట్ గా నటించిన “అల్లూరి” తో ఆడియెన్స్ ని పలకరించగా ఇపుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేయడం జరిగింది. మరి ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు సమర్పణలో రానుండగా వివాహ భోజనంబు డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు.

మరి ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ దండ నిర్మాణం వహించనుండగా ఈ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. భాను బోగవరపు కథ అందించిన ఈ చిత్రాన్ని హీరో నారా రోహిత్ ఫస్ట్ క్లాప్ కొట్టి ఆరంభించగా దర్శకుడు వి ఐ ఆనంద్ తదితరులు ఈ సినిమా ఆరంభ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనుండగా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :