మరో కొత్త సినిమాకి సైన్ చేసిన యంగ్ హీరో !
Published on Jan 21, 2017 2:10 pm IST

sri-vishnu
ఈ మధ్యే విడుదలైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు కెరీర్ ఆ సినిమాతో బాగా ఊపందుకుంది. అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలంగా ప్రకాష్ రావ్ నిర్మాణంలో కుమార్ వట్టి డైరెక్షన్లో ‘మా అబ్బాయి’ చిత్రంలో నటిస్తున్న శ్రీ విష్ణు తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఇంద్రసేన డైరెక్ట్ చేయనున్నాడట. బాబా క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీ విస్ష్ణు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. ఈ చిత్రం కూడా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తరహాలోనే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook